Allu Arjun Case: విచారణ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్..! 12 d ago
సంధ్య థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి మంగళవారం ఉదయం 11.05 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి, బన్నీ వాసు వచ్చారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన లో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్‌ను దాదాపు 2.47 గంటల వరకు ప్రశ్నించారు. ఏసీపీ రమేశ్, ఇన్స్‌పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశారు. విచారణలో అల్లు అర్జున్ ను ఆ వీడియో ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ అనంతరం పోలీసులు అల్లు అర్జున్‌ను భారీ బందోబస్తు నడుమ జూబిలీ హిల్స్ లోని తన నివాసానికి తీసుకెళ్లారు.
అల్లు అర్జున్ పై మరో కేసు నమోదు...
తాజాగా విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా హీరో మూత్ర విసర్జన చేసాడని, మూవీ లో కొన్ని సీన్లు పోలీసులని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న మేడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.